News September 22, 2024

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు: గుంటూరు ఎస్పీ

image

నగరంలోని పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలతో శనివారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య, మైనర్లు డ్రైవింగ్ నడపడం తదితర అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ మైనర్లు వాహనాలు నడిపితే తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థల వద్ద పోలీసు భద్రత పెంచుతామని సూచించారు.

Similar News

News September 22, 2024

గుంటూరు: భర్త అనుమానంతో వేధిస్తున్నాడు

image

భర్త అనుమానంతో వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వరగానికి చెందిన వీరయ్యకు గుంటూరుకు చెందిన రాణితో 10ఏళ్ల క్రితం పెళ్లైంది. ఎవరితో మాట్లాడినా అనుమానంతో వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి వచ్చి తరచూ.. గొడవపడి తన్నుతున్నాడని, మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

News September 22, 2024

‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

image

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈనెల 24 నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులు, జేసీ స్వరాజ్‌తో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన గొడ పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 21, 2024

సంక్షోభంలో గుంటూరు వైసీపీ

image

గుంటూరు అర్బన్‌లో వైసీపీ సంక్షోభంలో పడింది. ఎన్నికల సమయంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా తాజాగా పార్టీకి మరో నలుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్ ధనలక్ష్మి, 13వ డివిజన్ కార్పొరేటర్ సంకురి శ్రీను, 18వ డివిజన్ కార్పొరేటర్ వెంకట రమణ, 56వ డివిజన్ కార్పొరేటర్ కనకదుర్గ తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్‌కు పంపారు.