News April 8, 2025
మైనర్ డ్రైవింగ్‌పై HYD పోలీసుల ప్రత్యేక డ్రైవ్

HYDలో సోమవారం మైనర్ డ్రైవింగ్ లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ.. చాలా ప్రమాదాలు డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా, లైసెన్సు లేని మైనర్లు నడపడం వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక తనిఖీల ద్వారా మైనర్లు నడిపిన వాహనాలు గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. వాహనాలను ఇచ్చిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.
News November 4, 2025
సర్కారు వారి పాట.. ఎకరం రూ.99 కోట్లు

రూ.1,2 కోట్లు కాదు.. రూ.99 కోట్లు.. ఇదీ కోకాపేటలోని ఒక ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఈ మొత్తం చెల్లిస్తే ఎకరం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. దీనికి వేలం వేస్తారు. అంటే ఈ రేటు డబుల్ కావచ్చు. ఈ నెల 24, 28 తేదీలతోపాటు వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రభుత్వం ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కనీసం రూ.150 కోట్లైనా సంపాదించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
News November 4, 2025
మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

రానున్న 2-3 గంటల్లో నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముండగా, ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీలోపు ఉండే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.


