News January 22, 2025
‘మైనర్ పిల్లలకు వివాహాలు చేయడం నేరం’

విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపైన అవగాహన పెంచుకోవాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. బుధవారం వనపర్తిలోని మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఆమె మాట్లాడుతూ.. బాలల కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్ పిల్లలకు వివాహాలు చేయడం నేరమని చెప్పారు.
Similar News
News December 13, 2025
కానిస్టేబుల్స్కు 16న నియామక పత్రాలు: హోంమంత్రి అనిత

కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్స్కు ఈనెల 16న నియామక పత్రాలు అందజేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను ఆమె పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో హాజరుకానున్నట్లు చెప్పారు.
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


