News April 10, 2025
మైనర్ బాలికతో అసభ్యకర ప్రవర్తన.. రెండేళ్ల జైలు శిక్ష

మైనర్ బాలిక స్నానాల గదిలో ఉండగా ఆమెను దొంగచాటుగా చూస్తున్న గాంచిరీ శివకుమార్ అనే వ్యక్తిని బాలిక ప్రశ్నించగా ఆమెను చంపుతానని బెదిరించిన ఘటనలో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి బుధవారం సాయంత్రం తీర్పునిచ్చారు. ఈ ఘటన 2020 సంవత్సరంలో ఏలూరులోని తూర్పు వీధిలో జరిగింది. బాలికకు రూ.50 వేలు నష్టపరిహారాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Similar News
News January 8, 2026
Official: ‘జన నాయగన్’ విడుదల వాయిదా

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
News January 8, 2026
కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.


