News January 20, 2025
మైనస్ 8 డిగ్రీల చలిలో తాడిపత్రి చిన్నారుల నృత్యం

తాడిపత్రికి చెందిన చిన్నారులు జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్, హిడింబ వద్ద మైనస్ 8 డిగ్రీల చలిలో కూచిపూడి నృత్యం చేసి అందరిని అబ్బురపరిచారు. దాదాపు 22 కిలోమీటర్లు కాలినడకన చేరుకుని నృత్య ప్రదర్శన చేసినట్లు శిక్షకులు వందన, ప్రవీణ్ లు తెలిపారు. ఈ చిన్నారులు ఇప్పటికే వరల్డ్ రికార్డ్ బుక్‌లో చోటు సంపాదించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అభినందనలు అందుకున్నారు.
Similar News
News December 9, 2025
అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 9, 2025
అనంత: పోలీసుల PGRSకు 128 పిటిషన్లు.!

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSకు ప్రజల నుంచి 128 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.