News March 31, 2025
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది: కడియం

దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్యే కడియం రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. లౌకికవాదం మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
Similar News
News November 7, 2025
జగిత్యాల: రాయితీ పనిముట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా రైతులకు వివిధ రకాల పనిముట్లు, యంత్రాల కొనుగోలుపై రాయితీ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. పవర్ టిల్లర్లు, పవర్ విడర్లు, పవర్ స్పెయర్లూ, బ్రష్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పరిధికి చెందిన ఉద్యాన అధికారులను లేదా జగిత్యాలలోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 7, 2025
అనకాపల్లి: యువజన ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

జిల్లా యువజన సంక్షేమ శాఖ అనకాపల్లి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్‌ను గురువారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి ఏఎమ్ఏఎల్ కళాశాలలో జిల్లా స్థాయి యువజన విభాగ పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో గెలిచిన వారిని రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో గెలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామన్నారు.
News November 7, 2025
మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.


