News March 24, 2024

మైనార్టీల ఇలాకా ‘హైదరాబాద్’ పార్లమెంట్

image

HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్‌ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Similar News

News December 4, 2025

HYD: గూగుల్‌మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

image

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్‌లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?

News December 4, 2025

HYD: పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!

image

HYDలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికిపైగా ఆస్పత్రులు అందిస్తున్నాయి. అయితే.. నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటున్నట్లు MNJ వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పరిష్కారమని చెబుతున్నారు. ఊబకాయులు, పెరగుతున్న వయసు, పురుషుల్లో అధికంగా దీని లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.

News December 4, 2025

HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

image

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్‌లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌‌లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT