News December 2, 2024
మైలవరంలో 47 మంది అరెస్ట్
మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పుల్లూరు, పోరాట నగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. వారి వద్ద నుంచి రూ.29,100నగదు, 10 కోడి పుంజులు, 10 కోడి కత్తులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 16, 2025
కృష్ణా: ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
కుంభమేళా సందర్భంగా విజయవాడ, గయ(బీహార్) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07093 విజయవాడ- గయ రైలును ఫిబ్రవరి 5న, నం.07094 గయ- విజయవాడ ఫిబ్రవరి 7న నడుపుతున్నామంది. నం.07093 రైలు 5న సాయంత్రం 7.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 7న ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుందని, 7న నం.07094 రైలు సాయంత్రం 7.45 గంటలకు బయలుదేరి 9న ఉదయం 8 గంటలకు విజయవాడ చేరుకుంటుందని తెలిపింది.
News January 16, 2025
ముగిసిన పందేలు.. చేతులు మారిన వందల కోట్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్ల పందేలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగిన పందేలు సుమారు రూ.500 కోట్లు పందేలు కాసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బుధవారం సాయంత్రంతో పందెం రాయుళ్లకు పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. పటమట కొత్తపేట అంపాపురం బరులను అధికారులు మూసివేశారు.
News January 16, 2025
కృష్ణా: అలర్ట్.. ఈనెల 17తో ముగియనున్న గడువు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో అక్టోబర్ 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈనెల 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.