News February 14, 2025

మైలవరం: తండ్రిని కడతేర్చిన కొడుకు 

image

మైలవరం మండలం మెర్సుమల్లి గ్రామ సమీపంలోని ములకలపెంట, మొక్కజొన్న తోటలో గత శనివారం రాత్రి కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కొడుకే తండ్రిని కడతేర్చినట్లు తెలిపారు. చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడన్నారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం శుక్రవారం నాడు ముద్దాయిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Similar News

News December 4, 2025

ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మోటకొండూరులో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులకు వచ్చిన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని, ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.

News December 4, 2025

HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

image

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్‌లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌‌లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT

News December 4, 2025

రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

image

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.