News July 3, 2024
మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం

పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్ సోమవారం 43 మందికి పింఛన్లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News October 29, 2025
కృష్ణా: 46,357 హెక్టార్లలో పంట నష్టం

తుపాన్ ధాటికి జిల్లాలో 46,357 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. 427 గ్రామాల పరిథిలో ఈ పంట నష్టం జరగ్గా 56,040 మంది రైతులు నష్టపోయారన్నారు. 45,040 హెక్టార్లలో వరి పంట, వేరుశెనగ 288 హెక్టార్లలో, 985 హెక్టార్లలో మిముము, 43 హెక్టార్లలో పత్తి పంట నష్టపోయిందన్నారు.
News October 29, 2025
సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.