News February 15, 2025
మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
Similar News
News November 10, 2025
ఆదిలాబాద్: కొనసాగుతున్న అనిశ్చితి..!

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ADBలో ఎవరెవరు అధ్యక్షులైతే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 10, 2025
రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.


