News February 6, 2025

మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మైలవరం దర్గా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తిరువూరు విజయవాడ నుంచి తిరువూరు వైపుకు వెళ్తున్న ఆటో కారు ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న వ్యక్తి మృతి చెందగా ఆటో డ్రైవర్, బాలుడు, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు విజయవాడలో పెన్షన్ వెరిఫికేషన్‌కి వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 16, 2025

‘పుష్ప-3’ రిలీజ్ అయ్యేది అప్పుడే: నిర్మాత

image

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్‌లుగా నిలవగా, ‘పుష్ప-2’ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.

News March 16, 2025

భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

image

వారం రోజుల మిషన్‌పై వెళ్లి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమిపై అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న భూమికి తిరిగి రానున్నారు. వీరు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. దీంతో వ్యోమగాములిద్దరూ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కోరుకుంటున్నారు.

News March 16, 2025

FRO స్క్రీనింగ్ టెస్ట్.. 70.85% హాజరు

image

AP: రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇవాళ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని APPSC ప్రకటించింది. 70.85% హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.

error: Content is protected !!