News March 20, 2024
మైలవరం: 11 మంది వాలంటీర్ల తొలగింపు
దొమ్మరనంద్యాల గ్రామంలోని 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు బుధవారం మైలవరం ఎంపీడీఓ శంషాద్ భాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు తీసుకోవడం, ర్యాలీలో వెళ్లడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని పేర్కొన్నారు. దీంతో వారిని తొలగించామన్నారు.
Similar News
News January 15, 2025
ఎర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి
ఎర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.
News January 15, 2025
కడప రెగ్యులర్ RJDగా శామ్యూల్
కడప రెగ్యులర్ RJD (పాఠశాల విద్యాశాఖ)గా కె.శామ్యూల్ నియమితులయ్యారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న కె.శామ్యూల్ కడప జిల్లా RJDగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కడప జిల్లా RJDగా తన విధులను నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని వారు తెలిపారు.