News March 31, 2025
మొక్కజొన్న కంకి తిని వ్యక్తి మృతి

మొక్కజొన్న కంకులు తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయిన ఘటన కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వినోభానగర్‌కి చెందిన జర్పల కృష్ణ మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. తోటకు కాపలాగా వెళ్లి కంకులు కాల్చుకొని తిన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఒళ్లునొప్పులతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు.
Similar News
News April 4, 2025
MNCL: జాతీయస్థాయి పోటీలకు హాసిని ఎంపిక

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా ఉషూ లీగ్ పోటీలకు మంచిర్యాల జిల్లాకు చెందిన అటుకపుర హాసిని ఎంపికైంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వేముల సతీష్, ఆవుల రాజనర్సు వివరాలు వెల్లడించారు. సౌత్ జోన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. హాసినిని కోచ్ శివమహేష్, అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.
News April 4, 2025
నారాయణపేట జిల్లా కలెక్టర్ అసహనం

నర్వ మండలం పాతర్‌చేడ్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విశాలంగా వున్న గదుల్లోకి మార్చాలని ఆదేశించారు.
News April 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 4, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.