News September 18, 2024
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పరిషత్ ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆనంద్, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డులకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టేమన్నారు.
Similar News
News October 15, 2024
నెల్లూరుకు 750 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరుకి 750 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు ఉమ్మడి నెల్లూరు జిల్లాతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం 17వ తేదీ నెల్లూరు సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
News October 15, 2024
నెల్లూరు, తిరుపతి ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా మహహ్మద్ ఫరుఖ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 15, 2024
నెల్లూరు: వైస్‌షాపు లాటరీలో చిత్రవిచిత్రాలు
➤నెల్లూరు సిటీలో ఓ నాయకుడు 27 మందితో సిండికేట్‌గా మారి 150 అప్లికేషన్లు వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 కోట్లు చెల్లించారు. అయినప్పటికీ ఆయనకు ఒక్క షాపు కూడా రాలేదు.
➤లింగసముద్రం మండలంలో రెండు షాపులకు 68 అప్లికేషన్లు రాగా.. కేవలం ఒకే దరఖాస్తు పెట్టిన మహిళకు షాప్ తగిలింది.
➤ఆత్మకూరు సర్కిల్‌లో 321 అప్లికేషన్లకు ముగ్గురు మహిళలకు దుకాణాలు దక్కాయి.
➤అల్లూరులో ఓ నాయకుడు 15 అప్లికేషన్లు వేయగా ఒక్కటీ రాలేదు.