News January 17, 2025

మొగల్తూరులో అల్లుడికి 153 రకాల వంటకాల విందు

image

మొగల్తూరుకు చెందిన కెల్లా లక్ష్మీ కాంతం అల్లుడికి 153 రకాలతో విందు ఏర్పాటు చేశారు. తన కూతురు నాగలక్ష్మిని పాలకొల్లుకి చెందిన చిప్పాడ విజయ కృష్ణతో 29 ఏళ్ల క్రితం  వివాహం జరిపించారు. కొత్త అల్లుడికి ఏమాత్రం తీసిపోకుండా 153 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 

Similar News

News November 23, 2025

భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

image

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News November 23, 2025

భీమవరం: 29న మెగా జాబ్ మేళా

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 23, 2025

ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

image

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.