News June 4, 2024

మొదటిగా మంత్రాలయం.. చివరన పాణ్యం ఫలితాల వెల్లడి

image

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సగటున 10 గంటల నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొదటిగా మంత్రాలయం.. చివరన పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు వెళ్లడి కానున్నాయి.

Similar News

News September 17, 2024

రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం

image

ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.

News September 16, 2024

కర్నూలు: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య UPDATE

image

కోసిగి గ్రామానికి చెందిన బలకుందు కోసిగయ్య(52) సోమవారం మధ్యాహ్నం కోసిగి నుంచి ఐరనగల్ 523/40-42 కిలోమీటర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోసిగయ్య తాగుడుకు బానిసై, కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొండెం నుంచి తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు తెలిపారు.

News September 16, 2024

నంద్యాల ప్రజలు, దాడులు ఫ్యాక్షనిజాన్ని సహించరు: ఫిరోజ్

image

నంద్యాలలో తనపై జరిగిన దాడి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలను తమ కుటుంబం కానీ నంద్యాల పట్టణ ప్రజలు కానీ సహించబోరని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సోమవారం తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీలోని మరో వర్గానికి చెందిన తమ నాయకుడు ఫొటో లేదని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగారని ఫిరోజ్ తెలిపారు.