News August 6, 2024

మొదటి నెల జీతం యువత కోసం

image

కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మొదటి జీతం అందుకున్న సురేంద్రబాబు ఆ మొత్తాన్ని యువతకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మొదటి నెల జీతం రూ.1.75 లక్షలను అభయ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కళ్యాణదుర్గంలో ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన ఆ వేదికపైనే ఈ ప్రకటన చేశారు.

Similar News

News September 17, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.35

image

➤ అనంతపురం పాతూరు మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా మేలు రకం రూ.35తో అమ్మకాలు జరిగాయి. కనిష్ఠంగా కిలో రూ.20 పలికాయి.
➤ నగరంలోని మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.18వేల ప్రకారం విక్రయాలు జరిగాయి.

News September 17, 2024

ATP: దులీప్ ట్రోపీ మ్యాచ్.. టికెట్లు వీరికి మాత్రమే!

image

అనంతపురం ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో రౌండ్ మ్యాచ్‌లకు త్వరలోనే టికెట్లు పంపిణీ చేస్తామని అనంతపురం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు, కళాశాలలు, ఆర్డీటీ సబ్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులకు మ్యాచ్ పాసులను లెటర్ ప్యాడ్ ఆధారంగా అందజేస్తామని తెలిపారు. 9866157250 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News September 17, 2024

తాడిపత్రిలో 10 తులాల బంగారం చోరీ

image

తాడిపత్రిలోని గాంధీనగర్‌లో సోమవారం చోరీ జరిగింది. నాగరాజు ఇంట్లో లేని సమయంలో దాదాపు 10 తులాల బంగారాన్ని దూసుకెళ్లినట్లు పట్టణ పోలీసులకు భాదితులు నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.