News June 23, 2024

మొదటి సమావేశానికే అధికారుల డుమ్మా

image

శ్రీకాకుళం జిల్లా పలాస ఎంపీడీవో ఆఫీసులో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మార్వోతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. మరోవైపు లక్ష్మీపురం, అల్లుకోల సర్పంచ్‌లకు బదులుగా వాళ్ల బంధువులు హాజరయ్యారు. దీంతో ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News November 5, 2024

SKLM: రబీ వేరుశనగ పంటకు విత్తనాలు సిద్ధం

image

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఈ ఏడాదిలో రబీలో పంట సాగు చేసే రైతుల కోసం సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి కె. త్రినాధ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సీజనుకు గాను రైతు సేవా కేంద్రాలలో అధిక దిగుబడి నిచ్చే వేరుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విత్తనాలు కావలసిన రైతులు, రైతు సేవ కేంద్రాలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

News November 4, 2024

శ్రీకాకుళం: ఎస్పీ పరిష్కార వేదికకు 65 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులు స్వీకరణ పరిష్కారంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఆయా అధికారులకు ఆదేశించారు.

News November 4, 2024

సంతకవిటి: 27 తులాల బంగారం చోరీ

image

సంతకవిటి పోలీస్ స్టేషన్ పరిధిలో జిఎంఆర్ ఐటి గేటు ఎదురుగా నివాసం ఉండే శేషగిరిరావు అమ్మాయి పెళ్లి నిమిత్తం ఈనెల 2 తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఏలూరు వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం, బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో ఉన్న 27 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు.