News June 4, 2024

మొదట రౌండ్ నుంచి వెనుకంజలో గుడివాడ

image

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వైసీపీ నుంచి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్‌పై 94,058 ఓట్ల భారీ మెజారిటీని సాధించారు. 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి పల్లా శ్రీనివాసరావు తన ఆధిక్యతను కొనసాగించారు. చివరి రెండు రౌండ్లు ముగిసే సమయానికి పల్లా శ్రీనివాస్‌కు 1,55,587 ఓట్లు లభించాయి.

Similar News

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News September 29, 2024

అరకులో పాస్ పోర్టు ఆఫీస్..!

image

అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.

News September 29, 2024

విదేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

image

అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో తెలుగు ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.