News July 25, 2024
మొన్న వరంగల్ ఊసే లేదు.. మరి ఇవాళ

కేంద్ర బడ్జెట్‌లో బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల ఊసే లేకపోవడంతో ఓరుగల్లుకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఇందులోనైనా ప్రాధాన్యం దక్కుతుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి, కేయూ అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల డెవలప్ చేయాల్సి ఉంది. వరంగల్ కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.