News January 24, 2025
మోకాళ్లపై కూర్చొని విద్యార్థుల ప్రదర్శనలు తిలకించిన నిర్మల్ కలెక్టర్

ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే అధికారులు ప్రత్యేక కుర్చీల్లో కూర్చుంటారు.. కానీ నిర్మల్‌లో అందుకు భిన్నంగా మోకాళ్లపై కూర్చుండి ప్రదర్శనలు చూశారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నిర్మల్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. మోకాళ్లపై కూర్చుని బాలికల ప్రదర్శనలను తిలకించారు.
Similar News
News February 26, 2026
లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి ACB కోర్టు రేపటి దాకా రిమాండ్ విధించింది. గుంటూరు(D) జైలుకు అతడిని తరలించారు. A1 రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ ₹కోట్ల లావాదేవీలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘మద్యం సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా ఆర్డర్ ఫర్ సప్లై కేటాయించారు’ అని అందులో వెల్లడించారు.
News February 26, 2026
పార్వతీపురం: ‘ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి కావాలి’

జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.
News February 26, 2026
కన్నులపండువగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.


