News January 23, 2025

మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి

image

విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో‌ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.

Similar News

News February 15, 2025

విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

image

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది.

News February 15, 2025

గాజువాక: పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

image

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణరావు వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.

News February 14, 2025

విశాఖలో కీచక భర్తకు రిమాండ్

image

<<15458247>>పోర్న్ వీడియోలకు<<>> బానిసైన గోపాలపట్నంకి చెందిన నాగేంద్ర తన భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

error: Content is protected !!