News March 9, 2025

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

image

సంగారెడ్డి జిల్లాలోని మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదవ తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. https://telanganams.cgg.gov.in/ అనే వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 8, 2026

పార్వతీపురం: PGRS కార్యక్రమం రద్దు

image

పార్వతీపుం కలెక్టరేట్‌‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబుతో సమీక్ష కారణంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ఎవరు అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావద్దన్నారు.

News February 8, 2026

రేపు మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News February 8, 2026

డిప్యూటీ కలెక్టర్‌గా కొల్లూరు వాసి ఎంపిక

image

కొల్లూరు గ్రామానికి చెందిన కనపాల రాజా మాథ్యూ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం ఆయనకు గ్రామస్థులు మేళతాళాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఊరి వెలుపల నుంచి బాబూ జగజ్జీవన్ రావ్ విగ్రహం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఒక దళిత బిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహించడం గర్వకారణమని గ్రామ పెద్దలు కొనియాడారు.