News January 23, 2025
మోడల్ స్కూల్ విద్యార్థిని అభినందించిన సిద్దిపేట సీపీ

హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్లో రెండో ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లాలోని ఇర్కోడ్ తెలంగాణ మోడల్ స్కూల్ పదో తరగతి చదువుతున్న విద్యార్థి భార్గవ్ను సీపీ అనురాధ అభినందించి సర్టిఫికెట్ అందజేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
NGKL: గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈనెల 26, లేదంటే 27 తేదీలలో వెలువడే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ రావలసి ఉంది. జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంచకుండా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.


