News March 5, 2025

మోతెలో గుండెపోటుతో యువకుడు మృతి

image

ఉపాధి హామీ పథకం పనికి వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని కూడలి గ్రామానికి చెందిన నిమ్మరబోయిన మహేశ్(32) రోజు మాదిరిగా ఉపాధి హామీ కూలీ పనికి వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో చాతి వద్ద నొప్పి లేస్తుందని ఇంటికి వెళ్లాడు. అనంతరం వాంతులు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక వైద్యుడు వద్దకు తీసుకెళ్లలోపే గుండెపోటు రావటంతో మరణించాడు.

Similar News

News March 23, 2025

జగిత్యాల జిల్లాలో చికెన్ ధరలు ఇలా!

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ.200-220 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. జిల్లాలో చికెన్ ధరలు నిలకడగానే ఉన్నాయి అని నిర్వాహకులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

News March 23, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

రాజన్న SRCL జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. చందుర్తి(M) ఎనగల్ గ్రామంలో పసుల లచ్చయ్య(60) అనే ఉపాధిహామీ <<15847894>>కూలీ<<>> పనిచేసాక భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మామిండ్ల మహేశ్(24) ఈ నెల17న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్సపొందుతూ నిన్న మృతిచెందాడు. బోయినపల్లి మండలం మానవాడలో దాసరి నర్సయ్య(58) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

error: Content is protected !!