News March 4, 2025
మోతె: ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

మోతె మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 26, 2026
బెజవాడ రైల్వేస్టేషన్‌కు రూ.600 కోట్లు..!

విజయవాడ నగరంలో PPP మోడల్ కింద పలు భారీ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.660 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణకు టెండర్లు పిలుస్తున్నారు. విద్యాధరపురం డిపో నుంచి 100 విద్యుత్ బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని 19 ప్రధాన రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. రూ.600 కోట్లతో స్ట్రామ్ డ్రెయిన్ల నిర్మాణాన్ని కూడా ఇదే విధానంలో చేపట్టే అవకాశం ఉంది.
News February 26, 2026
ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ రూల్

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) సేల్స్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇంజిన్ పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) ఉండాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల కాలుష్యం 30% వరకు తగ్గడమే కాకుండా రైతులకు మేలు జరుగుతుంది. అయితే పాత వాహనాల్లో మైలేజీ 3-7% తగ్గే అవకాశం ఉంది. 2023 తర్వాత తయారైన వాహనాలకు ఈ ఇంధనం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
News February 26, 2026
హైదరాబాద్‌లో ప్రత్యక్ష నరకం

HYDలో దోమల బెడద కునుకు లేకుండా చేస్తోంది. పొగబెట్టినా పోతలే, నిద్రపోనిస్తలే.. ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్, మంచాల, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్‌నగర్లో ఎక్కువగా ఉంది. రాత్రంతా నరకం చూపిస్తున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తిచెందినా యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదా అని ప్రశ్నిస్తున్నారు.


