News March 3, 2025

మోత్కూరులో యువతి సూసైడ్

image

ఓ మైనర్ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన మోత్కూరు మున్సిపాలిటీలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఆరెగూడెంకు చెందిన మున్నకు కృష్ణా జిల్లా కొడాలి గ్రామానికి చెందిన బాలికతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఒక్కటైన ఇద్దరు మోత్కూరులో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం బాలిక ఇంట్లో ఉరేసుకుంది. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

జగిత్యాల: 253 మంది విద్యార్థుల గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్‌లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్‌కేఎన్‌ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.

News February 25, 2026

విధులకు డుమ్మా… 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్ల తొలగింపు

image

TG: ఓ పక్క ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు…మరోపక్క విధులకు డుమ్మాకొడుతూ ప్రైవేటు ప్రాక్టీసు. బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, Asst ప్రొఫెసర్ల బాగోతమిది. ఒకరో ఇద్దరో కాదు రాష్ట్రవ్యాప్తంగా 94మంది కొన్నేళ్లుగా విధులకు రావడం లేదు. వీరికి నోటీసులు జారీచేసిన ప్రభుత్వం తాజాగా అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గైర్హాజరీ తేదీ నుంచే ఈ టెర్మినేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

News February 25, 2026

WNP: క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాలు

image

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31న వనపర్తిలోని బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు హాజరుకావాలన్నారు. మండల స్థాయి ఎంపికలకు వెళ్లే బాల బాలికలు మొదటగా tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో
రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని పేర్కొన్నారు.