News March 3, 2025
మోత్కూరులో యువతి సూసైడ్

ఓ మైనర్ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన మోత్కూరు మున్సిపాలిటీలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఆరెగూడెంకు చెందిన మున్నకు కృష్ణా జిల్లా కొడాలి గ్రామానికి చెందిన బాలికతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఒక్కటైన ఇద్దరు మోత్కూరులో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం బాలిక ఇంట్లో ఉరేసుకుంది. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 26, 2025
తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: సీఎం

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో, శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్‌లో ఉందని చెప్పారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ తలసరి ఆదాయం ఎక్కువని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
News March 26, 2025
నారాయణపేట POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా NRPT డీసీసీ చీఫ్‌గా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం పలువురు సీనియర్ నేతలు ఆశిస్తుండగా ప్రశాంత్‌నే మరోసారి కొనసాగిస్తారని సమాచారం.
News March 26, 2025
శ్రీకాకుళం: ‘కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన గిరాకీ’

శ్రీకాకుళం జిల్లాలో కెమికల్ ఇంజినీర్లకు విపరీతమైన డిమాండు ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. అమరావతిలో బుధవారం సీఎం సమక్షంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.