News April 20, 2025

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనాజిపురం-దాచారం గ్రామాల మధ్య ఉన్న పత్తి మిల్లు వద్ద బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంపటికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 14, 2025

మెదక్: SUPER.. PHOTO OF THE DAY

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రామాయంపేట పరిధి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఓ తండ్రి అంగవైకల్యం కలిగిన తన కూతురిని పోలింగ్ కేంద్రం వద్దకు భుజాలపై మోసుకొచ్చి ఓటర్ చైతన్యాన్ని చాటుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఫొటో ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
SHARE IT

News December 14, 2025

కొమురవెల్లి: అచ్చమైన జానపదం.. మల్లన్న జాతర సంప్రదాయం

image

కొమురవెల్లి మల్లన్న జాతర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన అచ్చమైన జానపద జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం బోనాలతో జాతర ప్రారంభమై మూడు నెలలు కొనసాగుతుంది. జాతరకు ముందుగా మల్లన్న కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రావిచెట్టు, వరాల బండకు పూజలు చేస్తారు. సంతానం లేని మహిళలు వరాలబండను పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు. బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు.

News December 14, 2025

పసుపులో దుంపకుళ్లు తెగులు – నివారణ

image

నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు పంటకు దుంపకుళ్లు ముప్పు ఎక్కువ. దీని వల్ల కాండంపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దుంప చూస్తే వేర్లు కుళ్లి నల్లగా మారి, లోపల చిన్న పురుగులు ఉండి, దుర్వాసన వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100kgల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల కట్టడికి 3g కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10kgలు వేయాలి. కుళ్లినచోట లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణం పోయాలి.