News March 3, 2025

మోత్కూరు: సహజీవనం.. బాలిక సూసైడ్

image

మోత్కూరు మండలంలో ఆదివారం <<15633955>>బాలిక <<>> సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఆరెగూడెంకు చెందిన మున్నతో బాలికకు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ గదిలో DEC నుంచి కలిసి ఉంటున్నారు. మున్న ఆదివారం HYD వెళ్లగా బాలిక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబీకులు, యువకుడు వచ్చాక ఆత్మహత్యకు గల కారణాలు చెప్తామని SI తెలిపారు.

Similar News

News December 6, 2025

మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

image

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.

News December 6, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 6, 2025

వెస్టిండీస్ వీరోచిత పోరాటం..

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ అసాధారణ రీతిలో ఆడుతోంది. రికార్డు స్థాయిలో 531 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వీరోచిత పోరాటం చేస్తోంది. జస్టిన్ గ్రీవ్స్(181*), కీమర్ రోచ్ (53*) కలిసి 7వ వికెట్‌కు ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాయ్ హోప్ 140 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 17 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి ఉంది. మరి లక్ష్యాన్ని WI అందుకుంటుందా?