News January 28, 2025

మోత్కూర్: ఫిబ్రవరి 8 నుంచి రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు

image

మోత్కూర్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 8 ,9 ,10 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఈ పోటీలు జరిగే క్రీడా ప్రాంగణాన్ని సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పరిశీలించారు. అభ్యుదయ కళానిలయం, అభినయ కళా సమితి, ప్రజాభారతి సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఈ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు. 

Similar News

News December 4, 2025

ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

image

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.

News December 4, 2025

మునగాల: జీపీలో జాబ్ రిజైన్.. సర్పంచ్‌గా పోటీ

image

మునగాల మండలం వెంకట్రామపురం గ్రామ పంచాయతీ ఉద్యోగి మంద ముత్తయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వెంకట్రామపురం ఎస్సీ జనరల్ స్థానం కావడంతో, పోటీ చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు రాజీనామాను ఆమోదించడంతో, ఆయన ప్రచారం ప్రారంభించారు. అధికార పార్టీ ముత్తయ్యకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.

News December 4, 2025

ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.