News March 28, 2025

మోత్కూర్: లారీ దగ్ధం

image

మోత్కూరు మండలం పొడిచేడు శివారులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. రాత్రి మూడు గంటల సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే మోత్కూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 6, 2025

మంచిర్యాల: ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి సేవలను పొందడం ప్రతి పౌరుడి హక్కు అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మధుతో కలిసి ఆయన గోడప్రతులను ఆవిష్కరించారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

News December 6, 2025

సిద్దిపేట: అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన శ్రీదేవి

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట డిగ్రీ కళాశాల విద్యార్థిని అసాధారణ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఏ. శ్రీదేవి ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ హర్డిల్స్‌లో సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ జి. సునీత ప్రత్యేకంగా అభినందించారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు అనిర్విచనీయం: కాకినాడ ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వారు పోలీసు శాఖకు వెన్నెముకలా నిలబడి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.