News June 22, 2024
మోత మోగుతున్న టమాటా ధర.. కిలో 80 పైనే

టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. నెల క్రితం రైతు బజార్లలో కిలో రూ.25కు లభించిన టమాటా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. కొత్తగూడెం మార్కెట్కు నిత్యం 300 టన్నుల మేర టమాటాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి లేక వ్యాపారులు ఆర్డర్ చేసినా 100 టన్నులకు మించి రావడం లేదు.
Similar News
News December 14, 2025
ఖమ్మం: రెండో విడత.. ఖాతా తెరిచిన కాంగ్రెస్

కామేపల్లి మండలం పొన్నెకల్లు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ భూమిక గెలుపొందారు. సమీప అభ్యర్థిపై ఆమె 603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిక గెలుపు పట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు భూమిక కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
ఖమ్మం జిల్లాలో ‘కిక్’ ఎక్కిస్తోన్న జీపీ ఎన్నికలు..!

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం మధ్య, గత 13 రోజుల్లో వైరా డిపో నుంచి రూ. 130 కోట్ల విలువైన 1.59 లక్షల కేసుల మద్యం, 56 వేల కేసుల బీర్లు తరలించారు. ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అటు వ్యాపారులకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
News December 13, 2025
ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.


