News June 22, 2024
మోత మోగుతున్న టమాటా ధర.. కిలో 80 పైనే
టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. నెల క్రితం రైతు బజార్లలో కిలో రూ.25కు లభించిన టమాటా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. కొత్తగూడెం మార్కెట్కు నిత్యం 300 టన్నుల మేర టమాటాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి లేక వ్యాపారులు ఆర్డర్ చేసినా 100 టన్నులకు మించి రావడం లేదు.
Similar News
News November 15, 2024
ప్రతి ఒక్కరూ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, లక్ష్యం నిర్దేశించుకొని మంచిగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, స్థానిక బాల సదనంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పండిట్ జవహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వేడుకలో పాల్గొని పిల్లలతో సరదాగా గడిపారు.
News November 14, 2024
KMM: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం
రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ RM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి, పైన సూచించిన సమయంలో 99592 25954 నంబర్‌కు డయల్ తెలిపారు.
News November 14, 2024
పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం, బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.