News June 12, 2024
మోదీ ఆశీస్సులు తీసుకున్న రామ్మోహన్ నాయుడు

అమరావతిలో జరిగిన సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తుండగా.. రామ్మోహన్ ఆయనకు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రామ్మోహన్ భుజం తట్టారు.
Similar News
News March 27, 2025
పొందూరు: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొందూరు- దూసి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి పడడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి, ఎరుపు రంగు షార్ట్, తెలుపు రంగు బనియన్ ధరించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ నెంబర్ 9493474582ను సంప్రదించాలన్నారు.
News March 27, 2025
పలాస: పెళ్లయినా 50 రోజులకు యువకుడి మృతి

పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 27, 2025
టెక్కలి: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి

టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణారావు(62) అనే వ్యక్తి మంగళవారం రాత్రి పురుగులమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య భానమ్మ ఉన్నారు.