News April 8, 2025
మోమిన్పేట్: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. మంగళవారం మోమిన్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను మందులను జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 26, 2026
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ మీదుగా కాన్పూర్ సెంట్రల్(CNB)- మధురై(MDU) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.01927 CNB- MDU రైలు వచ్చే నెల 25 వరకు ప్రతి బుధవారం, నం.09128 MDU- CNB రైలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 27 వరకు ప్రతి శుక్రవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ప్రకటన విడుదల చేశారు.
News February 26, 2026
పనులు పరిశీలించిన చిత్తూరు కలెక్టర్

త్వరలో చిత్తూరులో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
News February 26, 2026
ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్.. బికినీల్లోని మహిళల మధ్యలో!

ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఫొటోలు బయటపడటం సంచలనం రేపుతోంది. US న్యాయ శాఖ రిలీజ్ చేసిన చిత్రంలో ఆయనకు ఇరువైపులా బికినీల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ముగ్గురి చేతుల్లో డ్రింక్స్ ఉండటం గమనార్హం. ఈ ఫొటోను 2006లో ఎప్స్టీన్కు చెందిన లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపంలో తీసినట్లు తెలుస్తోంది. అయితే ఆ మహిళలు హాకింగ్ సహాయకులని, చాలా కాలంపాటు వెంట ఉన్నారని ఆయన కుటుంబం తెలిపింది.


