News February 5, 2025
మోరిలో సత్రానికి 116 ఏళ్లు..!

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని వీరభద్రయ్య అన్నదాన సత్రానికి 116 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా అంతర్వేది తీర్థానికి వచ్చే యాత్రికులకు అష్టమి, నవమి, దశమి తిథుల్లో మోరి వద్ద జాన శంకరయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తీర్థం రోజున అంతర్వేదిలోనూ భోజనాలు అందిస్తున్నారు. పూర్వం నడిచి వెళ్లే భక్తులకు ఈ సత్రమే ఆశ్రయం ఇచ్చేదని గ్రామస్థులు చెబుతున్నారు.
Similar News
News January 16, 2026
MBNR: రేపు సీఎం రాక.. భారీ బందోబస్తు

మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ-1, అడిషనల్ ఎస్పీలు-7, డీఎస్పీలు-10, సీఐలు-34, ఎస్సైలు-77, ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు-182, పీసీలు/వుమెన్ పీసీలు-741, హోంగార్డులు-110, వుమెన్ పీసీలు/వుమెన్ హోంగార్డులు-22, మొత్తం 1,184 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో హాజరుకానున్నారు.
News January 16, 2026
ఊట్కూర్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఊట్కూర్ మండలం పెద్దపోర్ల గ్రామానికి చెందిన కంట్రోల్ వెంకటయ్య కూతురు మంజుల (21) గురువారం మహబూబ్‌నగర్‌లో ఉద్యోగం ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి సమాచారం ఇవ్వలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పింక్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి ఉండగా, ఎత్తు సుమారు 5.1 అడుగులు. ఆచూకీ తెలిసిన వారు ఊట్కూర్ పోలీసులను 8712670412 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
News January 16, 2026
14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.


