News March 10, 2025

మోరి చేనేత కార్మికుల నైపుణ్యానికి రాష్ట్రపతి ప్రశంస

image

న్యూఢిల్లీలోని నేషనల్ డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత మహోత్సవంలో మన రాష్ట్రం నుంచి సఖినేటిపల్లి మండలం మోరి చేనేత స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం పరిశీలించారు. కళాకారుల ప్రతిభకు ఆమె ముద్దులయ్యారు. చేనేత కళాకారులను ప్రశంసించారు. కార్మికులు ఎంతో అద్భుతంగా చేనేత వస్త్రాలను తయారు చేశారని వారిని అభినందించారు. వివరాలను నిర్వాహకులు నల్లా ప్రసాద్ తెలిపారు.

Similar News

News November 26, 2025

ASF: సర్పంచ్ పోటీకి యువత గురి

image

అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం. సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చూపిస్తామంటూ ఆసిఫాబాద్ జిల్లా యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్‌గా తీసుకునే రాజకీయ నేతలకు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో చాలామంది యూత్ సర్పంచ్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాంకిడి సర్పంచ్ స్థానానికి పోటీ చేసే ఆశావహుల పేర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

News November 26, 2025

డైరెక్టర్ సంపత్ నంది తండ్రి కన్నుమూత

image

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిష్టయ్య(73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంపత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘చిన్నప్పుడు జబ్బు చేస్తే నన్ను భుజంపై 10KM మోసుకెళ్లింది మొన్నే కాదా అనిపిస్తోంది. నీకు నలుగురు పిల్లలున్నారు. వాళ్లకీ బిడ్డలున్నారు. ఏ కడుపునైనా ఎంచుకో. ఏ గడపనైనా పంచుకో. కానీ మళ్లీ రా’ అని రాసుకొచ్చారు.

News November 26, 2025

ఆస్పత్రి నుంచి స్మృతి తండ్రి డిశ్చార్జ్.. పెళ్లిపై ప్రకటన ఉంటుందా?

image

మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు యాంజియోగ్రఫీ సహా అన్ని టెస్టులు పూర్తయ్యాయని, ఎక్కడా బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. మరోవైపు స్మృతి పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలకు కుటుంబం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ బయటకు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం <<18385575>>తెలిసిందే.<<>>