News March 10, 2025
మోరి చేనేత కార్మికుల నైపుణ్యానికి రాష్ట్రపతి ప్రశంస

న్యూఢిల్లీలోని నేషనల్ డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత మహోత్సవంలో మన రాష్ట్రం నుంచి సఖినేటిపల్లి మండలం మోరి చేనేత స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం పరిశీలించారు. కళాకారుల ప్రతిభకు ఆమె ముద్దులయ్యారు. చేనేత కళాకారులను ప్రశంసించారు. కార్మికులు ఎంతో అద్భుతంగా చేనేత వస్త్రాలను తయారు చేశారని వారిని అభినందించారు. వివరాలను నిర్వాహకులు నల్లా ప్రసాద్ తెలిపారు.
Similar News
News March 23, 2025
గేట్‌లో పంగులూరు విద్యార్థికి ఆలిండియా 81 ర్యాంకు

2025 సంవత్సరానికి సంబంధించి గేట్ పరీక్షలో పంగులూరు గ్రామానికి చెందిన పుత్తూరి లక్ష్మీ శ్రీ సాయి లోకేశ్‌కు ఆల్ ఇండియా స్థాయిలో 81వ ర్యాంకు వచ్చింది. సాయి లోకేశ్ ఏడో తరగతి వరకు ఒంగోలులో, పదో తరగతి వరకు చిలకలూరిపేటలో, పాలిటెక్నిక్‌ను ఒంగోలులోని దామచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు.
News March 23, 2025
ద్వారకాతిరుమల: కిడ్నాపర్‌కు సహకరించిన వ్యక్తి అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ద్వారకాతిరుమల మండలానికి చెందిన బాలికను తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు 3 నెలల క్రితం కిడ్నాప్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడితోపాటు మరో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన తెలంగాణ రాష్ట్రం, కలిగోట్‌కు చెందిన సురేశ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.
News March 23, 2025
28న చింతలూరు నూకాంబిక జాతర

ఆలమూరు మండలం చింతలూరులో కొలువైయున్న నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆలయ కమిటీ శనివారం తెలిపింది. 28వ తేదీ శుక్రవారం అమ్మవారి జాతర జరుగుతుందన్నారు. 29వ తేదీ శనివారం తీర్థం జరుగుతుందని చెప్పారు. 30వ తేదీ ఆదివారం ఉగాది ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.