News February 11, 2025

మోసపూరిత SMSలపై అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

image

వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 11, 2026

నెల్లూరు జిల్లాలో పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

image

నెల్లూరు జిల్లాలో కొత్తగా రెండు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుత్తలూరు మండలం పాపంపల్లెలో డిఫెన్స్ రా మెటీరియల్ తయారీ యూనిట్ కోసం 349.95 ఎకరాలు కేటాయించడానికి ఓకే చెప్పింది. ఇక్కడ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే మనుబోలు మండలం మడమనూరు వద్ద 250 ఎకరాల్లో రూ.3500 కోట్లతో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

News April 11, 2026

నెల్లూరు: నేటి నుంచి చేపల వేట బంద్

image

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

News April 11, 2026

నేర నియంత్రణే లక్ష్యం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.