News April 19, 2024
మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో శంకర్పల్లి వాసి
శంకర్పల్లి మున్సిపాలిటీ వివేకానంద నగర్ కాలనీకి చెందిన దండుగుల వెంకటేష్ నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపు పాల్గొని 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించారు. తన మిత్రుడు నరేష్ రెడ్డితో కలిసి సుమారు వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.
Similar News
News September 20, 2024
HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి కాదు అబ్బాయి!
న్యూడ్ కాల్స్ పేరిట యువకులను మోసం చేస్తున్న వ్యక్తిని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బెంగుళూరు వాసి రిషద్ బేడీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి లాగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, పలువురు యువకులను ఆకట్టుకున్నాడు. బాధితుల న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
News September 19, 2024
HYD: సేవాసంస్థలకు దరఖాస్తుల ఆహ్వానం
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునివృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు విశేష సేవలు అందించిన సంస్థలు ఈనెల 25లోపు హైదరాబాద్ నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ భవనంలో దరఖాస్తులు అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫార్మ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. www.wdsc.telangana.gov.in
News September 19, 2024
బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.