News August 12, 2024
మౌస్ డీర్ సంతతి కేంద్రంగా నెహ్రూ జూపార్క్
నెహ్రూ జూపార్క్ మూషిక జింకల (మౌస్ డీర్) సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలోని షెడ్యూల్-1లో మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో 2010 మార్చి 3న, నెహ్రూ జూపార్క్‌ను ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ వాటి సంతతి కేంద్రంగా దీన్నిిి గుర్తించింది. ఆ తర్వాత ఇందులో 500 మూషిక జింకలు జన్మించాయి.
Similar News
News January 20, 2025
HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!
ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.
News January 20, 2025
GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం
ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.
News January 20, 2025
చర్లపల్లి: మరో 8 రైళ్లు నడిపేందుకు నిర్ణయం
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుంచి మార్చిలో మరో 8 రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చర్లపల్లి టర్మినల్ నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి పచ్చ జెండా ఊపింది.