News January 30, 2025
మ్ముమిడివరం: ‘ఈవీఎం, వీవీ ప్యాడ్లకు పటిష్ట భద్రత’

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు, వివి ప్యాడ్ లకు పటిష్ట భద్రత చేకూర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కార్యనిర్వాహక అధికారి తాతబ్బాయి అన్నారు. గురువారం ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాలలో మూడో అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను ఆయన తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్ రాజకుమారితో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ గూర్చి అధికారులతో చర్చించారు.
Similar News
News February 17, 2025
మరో 112 మందితో భారత్ చేరుకున్న US ఫ్లైట్

అక్రమంగా ప్రవేశించారని కొందరు భారతీయులను అమెరికా స్వదేశానికి పంపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా US నుంచి అమృత్సర్కు 3వ సైనిక విమానం కొద్దిసేపటి కిందటే చేరుకుంది. ఇందులో 112 మంది వివిధ రాష్ట్రాల వాసులున్నారు. ఇప్పటికే 2 విమానాల్లో US అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. మరోవైపు, ఈ విమానాలను అమృత్సర్లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారని పంజాబ్ CM కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
News February 17, 2025
నల్లజర్ల: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నల్లజర్ల మండలం పోతవరంకు చెందిన గాడి వెంకటేశ్వరరావు (77) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై పరమహంస తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట పవర్ ప్లాంట్ ఎదురుగా కాలవ పక్కన అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడన్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీస్ స్టేషన్లో అనుమానస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News February 17, 2025
జనగామ: బునియాద్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇంట్లో యువ క్రాంతి బునియాద్ పేరుతో 3 రోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోనాసి క్రాంతి కుమార్, పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ రాజేశ్ నాయక్ పాల్గొని పలు రాజకీయ అంశాలపై శిక్షణ పొందారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్ తదితరులున్నారు.