News March 19, 2024
మ్యాడంపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామశివారులోని చెట్లపొదల్లో మహిళ చనిపోయి పడి ఉండటంతో అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 1, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,018 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.73,514, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,490, అన్నదానం రూ.10,014 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News December 31, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెయింటింగ్ సంఘం జేఏసీ చైర్మన్గా ఆనంద్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ చైర్మన్గా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ నూతన కార్యవర్గం సమావేశాన్ని KNR సర్కస్ గ్రౌండ్లో నిర్వహించారు. ఉమ్మడి KNR జిల్లాతో పాటు హుస్నాబాద్ జోన్ల నుంచి సమావేశానికి హాజరైన బిల్డింగ్ పెయింటర్స్ ఆమోదంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటయింది. జేసి చైర్మన్గా చాడ ఆనంద్, అధ్యక్షుడిగా ప్రభాకర్ను ఎన్నుకున్నారు.
News December 31, 2024
2024లో విజయాలతోనే రవాణా శాఖ ముగింపు: మంత్రి
2024 సంవత్సరం రవాణా శాఖ విజయాలతోనే ముగుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణను తీసుకొచ్చినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత సాధించినట్లు తెలిపారు.