News February 17, 2025
యజమానులకు చెప్పకుండా సర్వే చేయవద్దు: JC

భూ యజమానులకు తెలియకుండా సర్వే చేయరాదని ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎంతమంది రైతులకు నోటీసులు ఇచ్చారో తెలుసుకున్నారు. నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.
Similar News
News February 22, 2025
పాలకొల్లు: జగన్కు సవాలు విసిరిన మంత్రి నిమ్మల

వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరు వక్రీస్తున్నారో ప్రజా క్షత్రంలో తెల్చుకుందామని, మాజీ సీఎం జగన్కు మంత్రి నిమ్మల శుక్రవారం సవాల్ విసిరారు. పోడూరు మండలం జిన్నూరులో రూ.3 కోట్లతో చేపట్టిన ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..వెలిగొండ ప్రజెక్ట్ను మూడుసార్లు సందర్శించాను. ప్రాజెక్ట్ పూర్తికాలేదని జగన్ ఒప్పుకున్నట్లైతే జాతికి ఎలా అంకితమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 21, 2025
మొగల్తూరు : పేరుపాలెం బీచ్ సమీపంలో వ్యక్తి సూసైడ్

పేరుపాలెం బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపిన వివరాలు.. రిసార్ట్ సమీపంలోని సీఆర్ జెడ్ పరిధిలోని తోటలో గుళికలు తిని మృతిచెందాడు. అయితే అతని జేబులో ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉందని , ఫోన్ లాక్ ఓపెన్ కాలేదని వీఆర్వో దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడిది కృష్ణా జిల్లా కృతివెన్నుగా అనుమానిస్తున్నారు.
News February 21, 2025
భీమడోలు: కుళ్లిన ఎగ్ పఫ్ విక్రయాలు

భీమడోలు జంక్షన్లోని ఓ బేకరీలో గురువారం రాత్రి కుళ్లిన ఎగ్ పఫ్లను విక్రయించడం వివాదాస్పదమైంది. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామానికి చెందిన పులిపాటి రాజు అనే వ్యక్తి ఎగ్ పఫ్లను కొని ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లలు వాటిని తినే సమయంలో దుర్వాసన రావడంతో ఊసేశారు. దీంతో రాజు బేకరీ వద్దకు వెళ్లి, వ్యాపారిని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రాజు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.