News February 3, 2025

యడ్లపాడు: కలలో కనిపిస్తే.. దేవాలయం నిర్మించారు

image

యడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్ పేటలో పూజలు అందుకునే వెన్న ముద్ద బాలకృష్ణ స్వామి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా కొండవీడుకు వచ్చిన దేవరాయలుకి బాలకృష్ణుడు స్వప్నంలోకి వచ్చాడు. స్వామి ఆదేశాల మేరకు స్వయంభు ఏకశిలా మూర్తిగా ప్రతిష్ఠించారు. బాలకృష్ణని విగ్రహానికి, ఎక్కడ మనకు కనిపించని రీతిలో రాతి లోనే వస్త్రాలతో దర్శనమివ్వటం మరో ప్రత్యేకతగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. 

Similar News

News December 3, 2025

ఏపీ న్యూస్ అప్‌డేట్స్

image

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్‌లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్

News December 3, 2025

WGL: అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్..!

image

జిల్లాలోని దుగ్గొండి మండలం బంధంపల్లిలో సర్పంచ్ పదవి జనరల్‌ కేటగిరీగా రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ములుగు మాజీ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ సర్పంచ్‌గా పోటీకి నామినేషన్ పంపించారు. ఆన్లైన్‌లో ఫారం డౌన్‌లోడ్ చేసుకుని సంతకం చేసిన ఆయన, స్పీడ్‌ పోస్టు ద్వారా రిటర్నింగ్‌ అధికారి భద్రమ్మకు చేరేలా పంపించారు. లక్ష్మారెడ్డి భార్య సుభద్ర 2013-18లో ఇదే గ్రామానికి సర్పంచ్‌గా పని చేశారు.

News December 3, 2025

న్యూస్ రౌండప్

image

☞ కర్నూలు, నంద్యాల జిల్లాల టాప్ హెడ్‌లైన్స్
★ కర్నూలు-బళ్లారి రోడ్డును NHగా మార్చాలని కేంద్ర మంత్రికి TG భరత్ వినతి
★ RU పరిధిలో బీఈడీ ఫలితాలు విడుదల
★ సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై 925 మందిపై కేసులు
★ ఆలూరుకు కలెక్టర్ వస్తే సమాచారం ఇవ్వరా?: ఎమ్మెల్యే విరూపాక్షి
★ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో
★ కర్నూలు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం
★ శ్రీశైలంలో శివ స్వాముల రద్దీ