News February 3, 2025
యడ్లపాడు: కలలో కనిపిస్తే.. దేవాలయం నిర్మించారు

యడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్ పేటలో పూజలు అందుకునే వెన్న ముద్ద బాలకృష్ణ స్వామి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా కొండవీడుకు వచ్చిన దేవరాయలుకి బాలకృష్ణుడు స్వప్నంలోకి వచ్చాడు. స్వామి ఆదేశాల మేరకు స్వయంభు ఏకశిలా మూర్తిగా ప్రతిష్ఠించారు. బాలకృష్ణని విగ్రహానికి, ఎక్కడ మనకు కనిపించని రీతిలో రాతి లోనే వస్త్రాలతో దర్శనమివ్వటం మరో ప్రత్యేకతగా స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Similar News
News February 15, 2026
శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికి ఎందుకు ఇచ్చాడు?

పార్వతీదేవి శివునిపై అచంచలమైన భక్తితో కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, ఆమెను తనలో భాగంగా చేసుకున్నాడు. దీనివల్ల లోకానికి పురుషుడు (శివుడు – చైతన్యం), స్త్రీ (పార్వతి – శక్తి) వేర్వేరు కాదని ఈ రెండింటి కలయికతోనే సృష్టి నడుస్తుందని నిరూపించారు. ఇద్దరూ సమానమేనని, ఒకరు లేనిదే మరొకరు సంపూర్ణులు కారని ఈ రూపం చెబుతుంది. భక్తుడు భగవంతుడిలో లీనమవ్వడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
News February 15, 2026
‘శివోహం జాగరణ’లో సీఎం: పటిష్ట భద్రత

మహాశివరాత్రి సందర్భంగా నంబూరు వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన ‘శివోహం జాగరణ’కు సీఎం హాజరయ్యారు. ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారియా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 15, 2026
బాపట్లలో పండగ పూట విషాదం

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.


