News February 22, 2025
యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్: తిరుపతి JC

సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అని సర్క్యులేట్ అవుతున్న వార్త అవాస్తవమని తిరుపతి జేసీ శుభం బన్సల్ తెలిపారు. ఏపీపీఎస్సీ నుంచి అందిన సమాచారం మేరకు గ్రూప్-2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని JC పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని బన్సల్ హెచ్చరించారు.
Similar News
News March 19, 2025
రీ సర్వేలో పారదర్శకతకు పెద్ద పీట: కలెక్టర్

జిల్లాలో సమగ్ర భూ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, అత్యంత జవాబుదారీతనంతో భూ లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. బుధవారం ఆయన చందర్లపాడు మండలం, ఉస్తేపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న గ్రామ సరిహద్దుల నిర్ధారణ, రెండో దశ రీసర్వే డేటా సేకరణ కార్యకలాపాలను తనిఖీ చేశారు. ఆయన పలు శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.
News March 19, 2025
రామగుండం: సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: CP

పోలీసు సిబ్బంది సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ లో ‘పోలీస్ దర్బార్’ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సమస్యలున్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తద్వారా పరిష్కరిస్తామన్నారు. పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News March 19, 2025
సత్యసాయి: 10th పరీక్షలకు 141 మంది గైర్హాజరు.!

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో 141 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు 21,240 మందికి గాను 21,109 మంది విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను పదిమంది గైర్హాజరయ్యారన్నారు.