News January 19, 2025
యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక..

భీమవరం జిల్లా కలెక్టర్లు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సోమవారం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో, అన్ని మున్సిపాలిటీలోని, మండల కేంద్రాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 9, 2025
రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.
News February 9, 2025
దొంగను పట్టించిన నరసాపురం వాసులు

ఏసీ బోగీల్లో పనిచేస్తూ ఫోన్లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన నాగూర్ వలి తన భార్య బేగం, ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం లింగంపల్లి నుంచి నరసాపురం ఎక్స్‌ప్రెస్ 2ACలో ప్రయాణించారు. వారు ఫోన్ ఛార్జింగ్ పెట్టినిద్రపోగా.. వివేక్ ఫోన్ దొంగలించాడు. దీంతో అతడిని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 9, 2025
ప.గో: త్రాగునీరు కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.